ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వర్షపాతం తీవ్రంగా ఉంటుందని అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో గంటకు 40-60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.