అనకాపల్లి జిల్లా అచుతాపురంలోని రైతు శంకర్ రావు, తన భూమి రికార్డులను అధికారులు తారుమారు చేశారని ఆరోపిస్తూ, ఆత్మహత్యకు ప్రయత్నించేందుకు పెట్రోల్‌తో సిద్ధమయ్యాడు. పెట్రోల్ బాటిల్, లైటర్‌తో కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.