ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీల నాయకులు ఇటీవల ఓ ఆటవిడుపు కార్యక్రమంలో కామెడీ స్కిట్లు, రంగస్థల ప్రదర్శనలతో అలరించారు. మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, పాశం సునీల్ వంటి ప్రముఖులు పౌరాణిక, చారిత్రక పాత్రల్లో నటించి అదరగొట్టారు. సీఎం, ఇతర మంత్రులు ఈ ప్రదర్శనలను ఆస్వాదించారు. మహిళా నాయకురాళ్లు శారీ వాక్ తో ఆకట్టుకున్నారు.