చిత్తూరు జిల్లా పలమనేరులో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ఏడేళ్ల కుమారుడిపై తల్లి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి బ్లేడుతో బాలుడి శరీరం, మర్మాంగాలపై దాడి చేసింది. బాలుడి ఆర్తనాదాలు విని ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు బాలుడిని ఆసుపత్రికి తరలించారు. నిందితులు తల్లి ఇంద్రజ, ఆమె ప్రియుడు రాజు పరారీలో ఉన్నారు.