ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రకాశం, నెల్లూరు సహా పలు జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్, 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. సీఎం అధికారులను అప్రమత్తం చేశారు, పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.