ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వర్ష ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు ఏపీ వ్యాప్తంగా బుధవారం వరకు వర్షాలు కొనసాగుతాయి.