ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది. నేడు, రేపు రాష్ట్రంలో 42-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, కడప జిల్లాల్లో వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది.