అనంతపురం శిశు గృహంలో దసరా సెలవులు ఇవ్వలేదన్న కోపంతో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ రెండు నెలల పసికందు మృతి చెందింది. ఈ విషయం బయటపడకుండా మృతదేహాన్ని రహస్యంగా పూడ్చిపెట్టారు. సిబ్బంది మధ్య తలెత్తిన వివాదంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు, జిల్లా కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు.