అనకాపల్లి జిల్లా చోడవరం ఘోరానికి వేదికైంది. వివాహేతర సంబంధం అనుమానంతో ఇందిర అనే మహిళ తన భర్త వెంకటరావుపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన వెంకటరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.