ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 2న ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి విచ్చేస్తున్నారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న అమరావతి పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలుస్తుంది. కోటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధమైంది.