డ్రై ఫ్రూట్స్ లో బాదం ప్రత్యేకమైనది. ఇది ఫైబర్, విటమిన్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. బాదం శరీరానికి శక్తినిచ్చి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మెదడు అభివృద్ధి, ఎముకలు, దంతాల బలానికి తోడ్పడుతుంది. నానబెట్టి పొట్టు తీసి తింటే పోషకాలు పూర్తిగా అందుతాయి.