అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు ఆశ్రమ పాఠశాల నుండి పారిపోయిన ఇద్దరు బాలికల ఆచూకీ లభించింది. ఉపాధ్యాయులు మందలించడంతో మనస్తాపం చెంది, కించూరు సమీపంలోని కొండ గుహలో నాలుగు రోజులు దుంపలు తింటూ గడిపారు. డ్రోన్ సాయంతో పోలీసులు గుర్తించి తీసుకురావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.