ఇక ఎప్పుడూ నవ్వించే అలీ... తాజాగా సుహాస్ నటించిన ఓ భామ అయ్యో రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాలో సుహాస్‌కు మేనమామ క్యారెక్టర్ వేయాలని అనగానే.. తనకు ఆత్మహత్య చేసుకున్న తన మేనల్లుడు గుర్తొచ్చారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. 15 ఏళ్ల క్రితం నా మేనల్లుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.