భరణం హక్కు కాదు, సామాజిక న్యాయంగానే చూడాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్థికంగా స్థిరంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని భరణం కోరగా, కోర్టు తిరస్కరించింది. ఆర్థికంగా నష్టపోయిన వారికి మాత్రమే భరణం ఉంటుందని, అది స్త్రీ, పురుషులు ఎవరైనా కోరవచ్చని ఢిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. భరణం ఆర్థిక ప్రయోజనం కోసం కాదని తేల్చి చెప్పింది.