బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. టికెట్ ధరలపై ప్రత్యేక జీవో జారీ చేసింది. డిసెంబర్ 4న రాత్రి ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600గా నిర్ణయించగా, తొలి 10 రోజులు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ స్క్రీన్లలో రూ.75 అదనంగా పెంచుకునే వెసులుబాటు కల్పించింది.