వాము ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ, అధికంగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తవచ్చు. గ్యాస్, గుండెల్లో మంట, అల్సర్ ఉన్నవారు వామును తీసుకోవడం మానేయాలి. అధిక వినియోగం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, నోటిలో పుండ్లు, తల తిరగడం, వికారం వంటి లక్షణాలు కనిపించవచ్చు. గర్భిణీలు వామును తీసుకోకపోవడమే మంచిది.