అహ్మదాబాద్‌లోని మేగానీ ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. సివిల్ ఆసుపత్రి సమీపంలోని జనావాసాలపై విమానం పడిపోవడంతో 242 మంది ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యారు. ఘటనా స్థలానికి అత్యవసర సేవలు చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.