ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు దేశంలోనే తొలిసారి తల్లి గర్భంలోని 25 వారాల శిశువుకు విజయవంతంగా ఓపెన్ ఫీటల్ సర్జరీ చేశారు. స్పైనా బిఫిడా అనే వెన్నెముక లోపంతో బాధపడుతున్న శిశువుకు, పుట్టిన తర్వాత తలెత్తే తీవ్ర సమస్యలను నివారించేందుకు ఈ శస్త్రచికిత్స జరిగింది. 30 మంది డాక్టర్ల బృందం ఐదు గంటల పాటు శ్రమించి ఈ అద్భుతాన్ని సాధించింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.