భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీ పాల తయారీ విస్తృతంగా జరుగుతోంది. పాలపొడి, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. చిన్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు ఈ కల్తీ పాలను సేవించడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.