నాగిని సీరియల్ తో సుపరిచితురాలైన నటి మౌనీ రాయ్ హర్యానాలోని కర్నాల్ లో ఓ ఈవెంట్ లో వేధింపులకు గురయ్యారు. తాత వయసున్న ఇద్దరు అతిథులు ఫోటోల నెపంతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. నడుముపై చేతులు వేయడం, లో యాంగిల్ వీడియోలు తీయడం వంటి ఘటనలతో ఆమె తీవ్ర అసహ్యానికి గురయ్యారు.