తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయాన్నే ప్రారంభమైంది. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ మైలాపూర్‌లో తన కుటుంబంతో కలిసి ఓటు వేయగా, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం కారైకుడిలోని చిట్టల్ అచ్చి మెమోరియల్ స్కూల్లో ఓటు వేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు.