సినీ నటుడు నారా రోహిత్, ఆయన సతీమణి శిరీష ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.