నంద్యాల జిల్లా డోన్‌లో పది ఎకరాల పొలం పట్టా కోసం ఒక రైతు డోన్ ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిప్యూటీ ఎమ్మార్వో లక్ష రూపాయల లంచం డిమాండ్ చేయగా, చివరకు 60 వేలకు బేరం కుదిరింది. రైతు ఏసీబీని ఆశ్రయించగా, లంచం తీసుకుంటుండగా డిప్యూటీ ఎమ్మార్వో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.