ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం 5 గంటల నుంచి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. 18 బృందాలుగా విడిపోయి పలుచోట్ల సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో మణికొండలోని విద్యుత్ శాఖ అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ఇంటిపై దాడులు జరిగాయి. అంబేద్కర్ పై వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన ఇంట్లో ఏకంగా రూ.2 కోట్ల క్యాష్ సీజ్ చేశారు.