పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన 81 ఏళ్ల రిటైర్డ్ తెలుగు టీచర్ వసంత శర్మ, 20 ఏళ్లకు పైగా సేవా మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రతిరోజూ మంథని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు, వారి బంధువులకు ఉచితంగా పాలు, బిస్కట్లు అందిస్తూ, నెలకు దాదాపు రూ.20,000 ఖర్చు చేస్తున్నారు.