రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లా గలందర్ గ్రామంలో 70 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న 90 ఏళ్ల వృద్ధ మహిళ, 95 ఏళ్ల వృద్ధుడు ఇటీవల వివాహం చేసుకున్నారు. వారి వివాహ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆరుగురు సంతానం ఉన్న ఈ దంపతులు తమ జీవిత చరమాంకంలో పెళ్లి చేసుకునే కోరికను నెరవేర్చుకున్నారు.