ఘజియాబాద్‌లోని హాజీ ఖలీల్ అనే 70 ఏళ్ల రాజకీయ నాయకుడు 20 ఏళ్ల యువతిని నాలుగో పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది. వీరి మధ్య 50 ఏళ్ల వయోభేదం ఉంది. ఆయన రెండో భార్య ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొత్త వధువు హాజీ ఖలీల్ పిల్లల కంటే చిన్నదట. ఈ ఘటన సమాజంలో ఆశ్చర్యం కలిగిస్తోంది.