నిర్మల్ జిల్లా సోన్ మండలం గాంధీనగర్ ప్రాంతంలోని మత్స్యకారులు శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్ళారు. వారి వలలో 30 కిలోల బరువున్న భారీ బొచ్చ చేప చిక్కింది. ఈ చేపను బయటకు లాగడానికి నలుగురు కలిసి ప్రయత్నించారు. మార్కెట్లో ఈ చేప ధర కిలో రూ.250 ఉంది.