స్పెయిన్కు చెందిన 57 ఏళ్ల టెస్సా రోమేరో అనే మహిళ 24 నిమిషాల పాటు వైద్యపరంగా మరణించి తిరిగి బతికింది. ఆమె ఈ అనుభవం గురించి వివరిస్తూ, నొప్పి లేని, ప్రశాంతమైన ప్రపంచాన్ని చూశానని తెలిపింది. తన నిర్జీవ శరీరాన్ని పైనుంచి చూస్తున్నట్లు అనిపించిందని పేర్కొంది. ఈ ఘటన ఆమె జీవితాన్ని మార్చివేసింది.