నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులో మత్స్యకారులకు 22 కిలోల బరువున్న భారీ కృష్ణ బుచ్చ చేప చిక్కింది. ఈ అరుదైన సంఘటనతో ప్రాంత ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. చేపను చూడటానికి వచ్చిన వారు ఫోటోలు తీసుకున్నారు. మార్కెట్లో ఈ చేపకు మంచి ధర పలుకుతుందని మత్స్యకారుడు ఆనందం వ్యక్తం చేశాడు.