వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు తీపి కబురు అందించాయి. జూలై 1 నుంచి 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను భారీగా తగ్గించాయి. హైదరాబాద్లో రూ.176, ఢిల్లీలో రూ.183.50 తగ్గింపు నమోదైంది. అంతర్జాతీయ ముడిచమురు ధరల తగ్గుదల ఈ నిర్ణయానికి కారణం. గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.