న్యూయార్క్ నగరంలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ శిఖరంపై 1,454 అడుగుల ఎత్తులో జరిగిన ఓ ప్రేమ ప్రతిపాదన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రష్యాకు చెందిన ఏంజెలా నికోలా, వాన్యా బీర్కస్ అనే సాహసిక జంట చేసిన ఈ ప్రపోజల్ ఇప్పుడు 21వ శతాబ్దపు ఉత్తమ ప్రేమ ప్రతిపాదనగా గుర్తింపు పొంది, వైరల్‌గా మారింది. వారిని డేర్‌డెవిల్ కపుల్‌గా పిలుస్తున్నారు.