నేవీలోకి అత్యాధునిక యుద్ధనౌకలు.. శత్రువులకు ఇక చుక్కలే..
భారత నేవీ అమ్ముల పొదిలోకి మూడు అత్యాధునిక యుద్ధనౌకలు చేరాయి. దీంతో ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో భారత్ అగ్రగామి కావాలన్న లక్ష్యసాధన దిశగా మరో ముందడుగు పడింది. భారత నావికా దళం మరింత బలాన్ని పుంజుకుంది. నేవీ అమ్ముల పొదిలోకి అధునాతన యుద్ధనౌకలు చేరాయి. INS సూరత్, INS నీలగిరి, జలాంతర్గామి INS వాఘ్‌షీర్‌ను జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ముంబయిలోని నేవల్ డాక్‌యార్డ్‌లో INS సూరత్, INS నీలగిరి, INS వాఘ్‌షీర్‌ను ప్రారంభించారు ప్రధాని.
ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ధనౌకల్లో INS సూరత్ ఒకటి. పీ15బీ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ కింద ఈ యుద్ధనౌకను అభివృద్ధి చేశారు. ఇందులో స్వదేశీ వాటా 75 శాతం. ఈ యుద్ధనౌకలో అధునాతన ఆయుధ-సెన్సర్ వ్యవస్థలు ఉన్నాయని నేవీ తెలిపింది. నెట్‌వర్క్ సెంట్రిక్ సామర్థ్యం దీని సొంతం. INS నీలగిరి.. P 17ఏ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌక. శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని తయారుచేశారు. INS వాఘ్‌షీర్.. P 75 కింద రూపొందిస్తున్న ఆరో, చివరి జలాంతర్గామి. ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో ఈ యుద్ధనౌకను అభివృద్ధి చేశారు.
మరిన్ని వార్తలకోసం :
రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయుడు మృతి.. అసలు కథ ఇది!
కుంభమేళాలో సాధువుకు ఆగ్రహం తెప్పించిన యూట్యూబర్..సీన్ కట్ చేస్తే..
సంక్రాంతి పండుగ చేసుకోని ఏకైక గ్రామం.. ఆరోజు స్నానం కూడా చేయరట!

సింహం వేట మామూలుగా లేదు అమాంతం గాల్లోకి ఎగిరి మరీ

కుంభమేళాలో ఛార్జింగ్ తో గంటకు రూ.1000 సంపాదిస్తున్న యువకుడు..

బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేసాడని 100 డైల్ చేసిన గర్ల్ ఫ్రెండ్..

భార్య కోసం వెతికి ఆసుపత్రిలో చేరి భర్త.. సీన్ కట్ చేస్తే..

భర్త కాదు ఉన్మాది..సూసైడ్ చేసుకున్న ఓ ఇల్లాలి కథ వీడియో

దారుణం కత్తితో పొడిచి, యాసిడ్ పోసిన యువకుడు..వీడియో

రూ.7.8 కోట్ల ప్యాకేజీతో ప్రమోషన్, కానీ జీవితం కోల్పోయిన టెకీ ..
