AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!

ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!

Phani CH
|

Updated on: Jun 09, 2026 | 3:43 PM

Share

ఎవరెస్ట్ శిఖరంపై అదృశ్యమైన నేపాలీ షెర్పా గైడ్ హిల్లరీ దావా షెర్పా ఆరు రోజుల తర్వాత అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. 7,500 మీటర్ల ఎత్తులో మంచు తుపానులో చిక్కుకున్న అతడు మంచును నీరుగా మార్చుకుంటూ ప్రాణాలు నిలుపుకున్నాడు. ఖుంబు ఐస్‌ఫాల్ వద్ద అతడిని గుర్తించిన రక్షక బృందం ఆసుపత్రికి తరలించింది. ఈ ఘటనను పర్వతారోహకులు అసాధారణ మిరాకిల్‌గా అభివర్ణిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై ఒక ఊహించని అద్భుతం జరిగింది. మైనస్ డిగ్రీల చలి, ఆక్సిజన్ లేని శూన్య వాతావరణంలో.. ఆహారం, నీరు లేకుండా దాదాపు ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన నేపాలీ షెర్పా గైడ్ ‘హిల్లరీ దావా షెర్పా’ ప్రాణాలతో తిరిగొచ్చాడు. అధికారులు, పర్వతారోహకులు దీనిని ఒక అసాధారణ మిరాకిల్‌గా అభివర్ణిస్తున్నారు. మే 29న ఒక విదేశీ పర్వతారోహకుడిని కిందికి దింపే క్రమంలో, సుమారు 7,500 మీటర్ల ఎత్తులోని క్యాంప్ 3 వద్ద దావా షెర్పా అదృశ్యమయ్యాడు. హెలికాప్టర్ గాలింపు కూడా విఫలం కావడంతో, అతడు మంచు తుపానులో చనిపోయాడని భావించిన కుటుంబ సభ్యులు లూక్లాలోని తమ నివాసంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే, జూన్ 4న ఉదయం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సమీపంలోని ప్రమాదకరమైన ‘ఖుంబు ఐస్‌ఫాల్’ మంచు లోయల గుండా ఒక వ్యక్తి నెమ్మదిగా పాకుకుంటూ రావడం రూట్-సెట్టింగ్ బృందం గమనించింది. దగ్గరకు వెళ్లి చూడగా అది దావా షెర్పా అని తెలిసి వారు షాక్‌కు గురయ్యారు. మంచు పగుళ్లలో ఆశ్రయం పొంది, మంచును నీరుగా మార్చుకుంటూ అతడు ప్రాణాలు నిలుపుకున్నాడు. తీవ్రమైన ఫ్రాస్ట్‌బైట్ ఉన్నప్పటికీ అతడు స్పృహలోనే ఉన్నాడు. ప్రస్తుతం అతడిని ఖాట్మండు ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. తన తండ్రి బతికే ఉన్నాడనే వార్తతో కుమార్తె మెండో లూయిస్ ఆనందంతో కన్నీటి పర్యంతమైంది. షెర్పాల అసాధారణ పట్టుదలకు ఈ ఘటనే నిదర్శనమని పర్వతారోహణ సంఘం కొనియాడింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాస్ అంటే ఇతడే.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!

పేపర్ చదివేలోపు.. స్కూటీ కొట్టేసిన దొంగ

అమ్మా.. ఇదిగో నా మొదటి జీతం.. తల్లిదండ్రుల రియాక్షన్‌ ఇదే!

మనుషుల పై ఏఐ తిరగబడనుందా? అచ్చం రోబో సినిమాలో చూపినట్లుగా…!

వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది

Follow Us