
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద పాండా స్పందించారు. భక్తుల కోసం ఆలయం నిర్మిస్తే అపశ్రుతి చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంకటేశ్వర స్వామి తనతో ఆలయం కట్టించారని, నిన్నటి ఘటనపై అంతా ఆయనే చూసుకుంటారని పాండా భావోద్వేగానికి గురయ్యారు.ఈ ఘటనపై బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించినప్పుడు, బాధ్యత శ్రీనివాసుడిదే అని ఆయన స్పష్టం చేశారు. “నాపై ఒకటి కాదు, పది కేసులు పెట్టుకోండి. నాది నేను అనట్లేదు, మా శ్రీనివాసుడు చూసుకుంటాడు. నేను కోర్టుకు రాను, ఆయనే వస్తారు,” అని సవాల్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం :