బాలీవుడ్ మీద కన్నేసిన అందాల భామలు.. ప్లాన్ వర్కవుట్ అవుతుందా? వీడియో
కీర్తి సురేష్ బాలీవుడ్‌లో కొత్త సినిమా ఒప్పుకున్న వార్తతో మరికొందరు దక్షిణాది హీరోయిన్లు అక్కడి మార్కెట్‌పై దృష్టి సారించారు. పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఇప్పటికే ప్రయత్నాలు చేస్తుండగా, సాయి పల్లవి, సంయుక్త వంటి తారలు కూడా నార్త్‌లో స్థిరపడాలని చూస్తున్నారు. వీరి బాలీవుడ్ ప్రణాళికలు ఎంతవరకు విజయవంతమవుతాయో చూడాలి.
బాలీవుడ్‌లో కీర్తి సురేష్ కొత్తగా సినిమా ఒప్పుకున్నారని వార్తలు రాగానే, మరికొందరు దక్షిణాది హీరోయిన్లు కూడా బాలీవుడ్‌పై దృష్టి సారించారు. వీరిలో కొందరు కొత్తగా ప్రయత్నాలు చేస్తుండగా, మరికొందరు ఇప్పటికే అక్కడ సినిమాలు చేసి నిలదొక్కుకోవాలని చూస్తున్నారు. పూజా హెగ్డే గతంలో నార్త్‌లో పలు సినిమాలు చేశారు. నార్త్ సినిమాల కోసమే సౌత్‌లో అవకాశాలను కూడా వదులుకున్నారు. ప్రస్తుతం సౌత్‌లో సినిమాలు చేస్తూనే, నార్త్‌లో కూడా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వరుణ్ ధావన్‌తో కలిసి “హై జవానీతో ఇష్క్ హోనా హై” చిత్రంలో నటిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
