Viral Video: కదులుతున్న టెస్లా కారులో నిద్రపోయిన డ్రైవర్, ప్రయాణికులు.. నెట్టింట్లో వీడియో వైరల్..

ఖరీదైన కార్లను తయారు చేసే కంపెనీలలో టెస్లా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్న సంస్థగా టెస్లా మంచి గుర్తింపు పొందింది. ఇప్పటికే భారత్‏లో కూడా టెస్లా కార్ల సంస్థ

Viral Video: కదులుతున్న టెస్లా కారులో నిద్రపోయిన డ్రైవర్, ప్రయాణికులు.. నెట్టింట్లో వీడియో వైరల్..
Follow us

|

Updated on: Jan 18, 2021 | 5:22 PM

ఖరీదైన కార్లను తయారు చేసే కంపెనీలలో టెస్లా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్న సంస్థగా టెస్లా మంచి గుర్తింపు పొందింది. ఇప్పటికే భారత్‏లో కూడా టెస్లా కార్ల సంస్థ రాబోతున్న విషయం తెలిసిందే. టెస్లా తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో కొన్ని డ్రైవర్ లేకుండా కూడా నడిపేవి ఉన్నాయి. తాజాగా టెస్లా కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది.

వీడియోలో ఎముందంటే… ఆటోపైలట్ టెస్లా కారులో డ్రైవర్ మరియు ప్రయాణికుడు నిద్రపోతున్నారు. ఇక కారు రోడ్డుపై డ్రైవర్ సహయం లేకుండానే ముందుకు కదిలిపోతుంది. ఆ సన్నివేశం చాలా భయంకరంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. ఇది చూసిన నెటిజన్లు.. ‘ఇలా ప్రయాణించడం చాలా ప్రమాదకరమని’.. ‘ఆటో పైలట్ ఉన్నప్పటకీ ఇలా డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రపోవడం సరికాదని’ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై టెస్లా సంస్థ ఏ విధంగా స్పందింస్తుందో చూడాలి.

Also Read: Tesla Ceo Elon Musk: నాకు కోవిడ్ 19 వచ్చిందేమో ! ఓసారి పాజిటివ్, మరోసారి నెగెటివ్ ! తేల్చుకోలేని ఎలన్ మస్క్