Neelkanth Potato: నో ఫ్యాట్‌, నో షుగర్‌.. మార్కెట్‌లోకి కొత్తరకం ‘నీలకంఠ’ ఆలూ.!

|

Feb 26, 2024 | 8:55 AM

మనం బంగాళాదుంప, చిలకడదుంప, కంద దుంప, చేమ దుంప ఇలా రక రకాల దుంపలను చూసాం. తాజాగా ఈ దుంపల లిస్ట్‌లో కొత్తరకం బంగాళాదుంప వచ్చి చేరింది. అదే నీలకంఠ ఆలూ. తాజాగా దీనిని మార్కెట్‌లోకి విడుదల చేశారు. పేరుకు తగినట్టుగానే ఇది నీలి రంగులో ఉంది. షుగర్ పేషెంట్లు కూడా నిరభ్యంతరంగా దీనిని తినొచ్చని చెబుతున్నారు. ఈ నీలకంఠ బంగాళాదుంప రకాన్ని..

మనం బంగాళాదుంప, చిలకడదుంప, కంద దుంప, చేమ దుంప ఇలా రక రకాల దుంపలను చూసాం. తాజాగా ఈ దుంపల లిస్ట్‌లో కొత్తరకం బంగాళాదుంప వచ్చి చేరింది. అదే నీలకంఠ ఆలూ. తాజాగా దీనిని మార్కెట్‌లోకి విడుదల చేశారు. పేరుకు తగినట్టుగానే ఇది నీలి రంగులో ఉంది. షుగర్ పేషెంట్లు కూడా నిరభ్యంతరంగా దీనిని తినొచ్చని చెబుతున్నారు. ఈ నీలకంఠ బంగాళాదుంప రకాన్ని బీహార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన రోహ్తాస్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ అభివృద్ధి చేసింది. సాధారణ బంగాళదుంపతో పోలిస్తే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ బంగాళదుంపలో అనేక సుగుణాలు ఉన్నాయని రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రతన్ కుమార్ తెలిపారు. దీనిలో అతి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పైగా ఈ నీలకంఠ ఆలూలో చక్కెర చాలా తక్కువ శాతంలో ఉండి, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని తెలిపారు.

తెల్ల బంగాళదుంపల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీంతో షుగర్ పేషెంట్లు తెల్ల బంగాళాదుంపలను తినవద్దని వైద్యులు సూచిస్తుంటారు. ఎవరైనా నీలకంఠ బంగాళాదుంపలను సాగు చేయాలనుకుంటే రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం నుంచి విత్తనాలను ఆర్డర్ చేయవచ్చు. ఇతర విత్తనాలతో పోలిస్తే దీని విత్తనాలు కొంచెం ఖరీదైనవి. ఈ బంగాళదుంప వైరస్ రహితమని, ఈ బంగాళాదుంప మార్కెట్ విలువ అధికంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us on