Viral Video: గొప్ప గొప్ప నటులనే మించిపోయిన పిల్లులు.. ఆస్కార్ పర్ఫామెన్స్ మామూలుగా లేదుగా.. వీడియో

తాజాగా.. రెండు పిల్లులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో పిల్లులు గొప్ప గొప్ప నటులనే మించిపోయాయి.

Viral Video: గొప్ప గొప్ప నటులనే మించిపోయిన పిల్లులు.. ఆస్కార్ పర్ఫామెన్స్ మామూలుగా లేదుగా.. వీడియో
Cats Viral Video
Follow us

|

Updated on: May 21, 2022 | 12:46 PM

Cats Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ముఖ్యంగా కుక్కలు, పిల్లులకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ ప్రపంచంలో నిత్యం హల్చల్ చేస్తుంటాయి. వాటిలో ఉన్న సహజ ప్రతిభను చూసి అంతా నోరెళ్లబెడుతుంటారు. తాజాగా.. రెండు పిల్లులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో పిల్లులు గొప్ప గొప్ప నటులనే మించిపోయాయి. వాటిని చూసి నెటిజన్లంతా ఆస్కార్ పర్ఫామెన్స్.. అని.. వాటికి అవార్డు ఇవ్వాలంటూ పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో అందరిని తెగ నవ్విస్తోంది.

వీడియోలో.. ఒక మహిళ కుంగ్ ఫూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అయితే.. అక్కడ ఉన్న రెండు పిల్లులు ఆమె చర్యను దూరంగా ఉండి చూస్తున్నాయి. ఆమె కుంగ్ ఫూ చేస్తూ చేతులను కదిలిస్తుంటుంది. అయితే.. ఆమె గాలిలో వాటిపై దాడి చేసేలా చేస్తుంటుంది. ఆమె అలా చేసిన వెంటనే ఒక పిల్లి.. ఆ దెబ్బ తనకు గాయమైనట్లు స్పృహ తప్పి పడిపోయినట్లు నటిస్తుంది. ఆ తర్వాత రెండో సారి చేతులను కదిలించగానే.. మరొక పిల్లి కూడా మూర్ఛపోతుంది. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ ఫన్నీ వీడియోను ట్విట్టర్‌లో @TheFigen అనే యూజర్ షేర్ చేయగా.. 41 లక్షల మందికి పైగా వీక్షించారు. దీంతోపాటు వేలాది మంది లైకులు చేసి.. పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ పిల్లుల నటన ముందు, పెద్ద నటులు కూడా తేలిపోతారని ఓ యూజర్ పేర్కొనగా.. వీటి నటనకు ఆస్కార్‌ ఇవ్వాలంటూ మరో యూజర్ పేర్కొన్నాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..