Viral: ఎమ్మార్వో కార్యాలయం ముందు “చాకిరేవు”.! బట్టలు ఉతికి, ఆరేసి వెరైటీ నిరసన..
ఇదేంది.! ఇదేంది అయ్యా నేను ఎప్పుడు చూడలే ఇలాంటి నిరసన. నగ్న ప్రదర్శన నిరసన చూసుంటాం.. అరమీసం, అర గుండు గీయించుకునే నిరసనలు చూసుంటాం.. మోకాళ్ళ మీద నిలబడి.. ఒంటి కాలు మీద నిలబడి.. పొర్లు దండాలు పెట్టి ఇలాంటి అనేక నిరసనలు చూసుంటాం. కానీ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మార్వో కార్యాలయం దగ్గర ఓ బాధితుడు చేసిన నిరసన చాలా వెరైటీగా ఉంది.
ఇదేంది.! ఇదేంది అయ్యా నేను ఎప్పుడు చూడలే ఇలాంటి నిరసన. నగ్న ప్రదర్శన నిరసన చూసుంటాం.. అరమీసం, అర గుండు గీయించుకునే నిరసనలు చూసుంటాం.. మోకాళ్ళ మీద నిలబడి.. ఒంటి కాలు మీద నిలబడి.. పొర్లు దండాలు పెట్టి ఇలాంటి అనేక నిరసనలు చూసుంటాం. కానీ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మార్వో కార్యాలయం దగ్గర ఓ బాధితుడు చేసిన నిరసన చాలా వెరైటీగా ఉంది. కదిరి ఎమ్మార్వో కార్యాలయం ముందు గంగులప్ప అనే వ్యక్తి ఏకంగా చాకిరేవు పెట్టాడు. తాసిల్దార్ కార్యాలయం ముందు బట్టలు ఉతుకుతూ బాధితుడు గంగులప్ప వినూత్నంగా తన నిరసన వ్యక్తం చేశాడు. కాళసముద్రం గ్రామానికి చెందిన గంగులప్ప తన భూమి కొలతలు వేసి.. పాసుబుక్ ఇవ్వాలని ఏళ్ల తరబడి రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకోవడంలేదని ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసనకు దిగాడు. రజక వృత్తి చేసుకునే గంగులప్ప.. ఆ వృత్తినే నిరసనకు ఉపయోగించుకున్నాడు. భూమి కొలతలు వేసేందుకు వీఆర్వో డబ్బులు అడుగుతున్నాడని గంగులప్ప ఆరోపిస్తున్నాడు. అదేవిధంగా స్థానిక వైసీపీ నాయకుడు రెవిన్యూ అధికారులు భూమి కొలతలు వేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. కదిరి ఎమ్మార్వో కార్యాలయం ముందు బట్టలు ఉతికి నిరసన వ్యక్తం చేశాడు. ఉతికిన బట్టలను తాసిల్దార్ కార్యాలయం ముందు తాడు కట్టి… ఆరేసాడు. తనకు న్యాయం జరిగే వరకూ మిమ్మల్ని వదిలిపెట్టేది లేదంటూ.. అధికారులు బయటకు రావాలంటూ గంగులప్ప చాకిరేవు పెట్టాడు. తాసిల్దార్ కార్యాలయం ముందు బట్టలు ఉతికి.. భార్యతో కలిసి కార్యాలయం ముందు బైఠాయించి గంగులప్ప నిరసన వ్యక్తం చేశాడు. తనదైన స్టైల్ లో గంగులప్ప చాకిరేవు నిరసన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.