చైనా అరాచకాన్ని బయటపెట్టిన వీడియో..!
ఉయిగుర్లపై అరాచకాలను నిలిపివేయాలంటూ చైనాను ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డిటెన్షన్ క్యాంపులో బందీ అయిన ఓ యువకుడు తన కుటుంబానికి రహస్యంగా ఓ వీడియో పంపించాడు. డిటెన్షన్ క్యాంపులో తాను పడుతున్న కష్టాలను, అనుభవిస్తున్న బాధలను ఫోటోలు, టెక్స్ట్ మెసేజ్‌ల రూపంలో కుటుంబానికి పంపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.
చైనా దొంగ బుద్ధి మరోసారి బహిర్గతమైంది. మీదికి చెప్పేది ఒకటి.. చేసేదీ మరొకటి. ముస్లింలకు అండగా ఉంటున్నట్లు నటిస్తూ పాకిస్తాన్ వంత పాడుతున్న డ్రాగన్ కంట్రీ.. ఆ దేశంలోని ఉయిగుర్ ముస్లింల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తునడానికి వైరల్ గా మారిన వీడియోనే సాక్ష్యం చెబుతోంది. చైనీస్ డిటెన్షన్ క్యాంపుల్లో ఉయిగుర్ ముస్లింలు తీవ్ర కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే అమెరికాతో సహా అనేక దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉయిగుర్లపై అరాచకాలను నిలిపివేయాలంటూ చైనాను ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డిటెన్షన్ క్యాంపులో బందీ అయిన ఓ యువకుడు తన కుటుంబానికి రహస్యంగా ఓ వీడియో పంపించాడు. డిటెన్షన్ క్యాంపులో తాను పడుతున్న కష్టాలను, అనుభవిస్తున్న బాధలను ఫోటోలు, టెక్స్ట్ మెసేజ్‌ల రూపంలో కుటుంబానికి పంపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.
మెర్దన్ గప్పర్ అనే 31 ఏళ్ల వ్యక్తిని చైనా సైన్యం డిటెన్షన్ క్యాంపులో బంధించింది. గప్పర్ ఒకప్పుడు మోడల్‌గా కూడా పనిచేశాడు. అయితే అతడిని చైనా పోలీసులు అక్రమ డ్రగ్స్ కేసులో మార్చిలో అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని డిటెన్షన్ క్యాంపునకు తరలించారు. అయితే గప్పర్ కు సంబంధించి వివరాలను ఏమాత్రం అతని కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు చైనా పోలీసులు. ఈ నేపథ్యంలో రహస్యంగా ఫోన్ సంపాదించిన గప్పర్ తన పరిస్థితిని వివరిస్తూ వీడియోను షూట్ చేశాడు. తన ఫొటోలను, వీడియోల ద్వారా కుంటుంబానికి షేర్ చేశాడు. తన పరిస్థులను వివరిస్తూ కొన్ని మెసేజ్‌ల రూపంలో పంపాడు. ఆ వీడియోలో తన చేతికి ఉన్న బేడీలను, తనను బంధించిన గదిని, కిటికీ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలను గప్పర్ చూపించాడు. అయితే, యువకులను, 13 సంవత్సరాలలోపు చిన్నారులే లక్ష్యంగా సైన్యం బంధిస్తోందని, తీవ్రంగా హింసిస్తోందని గప్పర్ ఆ వీడియో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండటంతో చైనాపై మరింత ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. చైనా మానవ హక్కులను కాలరాస్తుందనడానికి ఈ వీడియో మరో ఉదాహరణ అని హ్యుమన్ రైట్స్ ప్రతినిధులు అంటున్నారు.
Inside a Uyghur’s ‘quarantine’ room: Video shows shackles, filthy conditions and propaganda https://t.co/9qitTHeqdY
— The Globe and Mail (@globeandmail) August 5, 2020