Breaking News
  • హైదరాబాద్‌: గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ దాష్టీకం. విద్యార్థిని నేలకేసి కొట్టిన ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం. ప్రిన్సిపాల్‌ను నిలదీసిన విద్యార్థి తల్లిదండ్రులు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండని దురుసుప్రవర్తన. ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణం కులంపేరుతో దూషిస్తూ.. చితకబాదుతున్నాడని కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు.
  • ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ. విచారణకు హాజరుకాని తెలంగాణ పీసీబీ అధికారులు . తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా . పర్యావరణ అనుమతుల విషయంలో పీసీబీ అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న పిటిషనర్‌ హయాతుద్దీన్‌.
  • ఢిల్లీ: 2020-21 వార్షిక బడ్జెట్‌ ప్రతుల ముద్రణ ప్రారంభం. ఆర్థికశాఖ కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక. బడ్జెట్‌ ప్రతుల ముద్రణ సందర్భంగా హల్వా వేడుక ఆనవాయితీ. హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థికశాఖ కార్యదర్శులు.
  • ప.గో: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని బీజేపీ నినాదం-మాణిక్యాలరావు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి టీడీపీ మాట్లాడుతోంది. ఐదు కోట్ల ఆంధ్రుల తరపున బీజేపీ-జనసేన పోరాడుతుంది. రాష్ట్రంలో జగన్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోంది-మాణిక్యాలరావు.
  • సిద్దిపేట: గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌ మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోనుంది. 2 వేల వార్డులు గెలుస్తామంటున్న బీజేపీకి.. గజ్వేల్‌లోని 20 వార్డుల్లో ఏ ఒక్క వార్డు గెలవలేరు-హరీష్‌రావు. 20 వార్డులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి-హరీష్‌రావు.

ఆ బాబును దేవుడే కాపాడాడు..ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్

shocking video of a boy who is crush by running car in Surat but he is safe, ఆ బాబును దేవుడే కాపాడాడు..ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్

నిజంగా ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఒళ్లు గగుర్పొడుస్తుంది. తన పైనుంచి కారు పోయినా సురక్షితంగా బయటపడ్డాడు ఓ బాలుడు. సూరత్‌లోని ఓ కాలనీలో వర్షం పడుతుంటే గొడుగు పట్టుకుని బయటకు వచ్చాడు ఓ ఏడేళ్ల కుర్రాడు. నడుస్తూ నడుస్తూ ఉన్నట్టుండి కూర్చొని అక్కడ పారుతున్న వర్షపు నీటితో ఆడుకోవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అక్కడో వ్యక్తి కారు రివర్స్​లో వెనక్కి తీసుకొచ్చాడు. గొడుగు కిందున్న చిన్నారిని గమనించని డ్రైవర్ చిన్నారిపైనుంచే కారును పోనిచ్చేశాడు. పక్కనున్న వాళ్లు అలర్ట్ అయ్యి బాలుడు కారు కింద ఉన్నాడని సిగ్నల్స్ ఇవ్వడంతో .. అప్రమత్తమై వాహనాన్ని ఆపాడు.గొడుగు పూర్తిగా ధ్వంసం అయ్యింది గానీ చిన్నారికి చిన్న గాయం కూడా కాలేదు. సురక్షితంగా తిరిగొచ్చిన బిడ్డను హత్తుకుంది ఆ బుడ్డోడి తల్లి. సీసీటీవీల్లో రికార్డయిన ఈ మృత్యుంజయుడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.