Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

రూల్స్ బ్రేక్.. కొచ్చి లోని బహుళ అంతస్తులు క్షణాల్లో నేలమట్టం

video.. flats razed with controlled explosions in seconds in kochi, రూల్స్ బ్రేక్.. కొచ్చి లోని బహుళ అంతస్తులు క్షణాల్లో నేలమట్టం

కేరళలోని కొచ్చిలో శనివారం బహుళ అంతస్థుల నిర్మాణాలు క్షణాల్లో కుప్పకూలాయి. కేవలం కొన్ని సెకండ్లలో ఇవి నేలమట్టమయ్యాయి. ఈ కోస్టల్ సిటీలో లెక్కకు మిక్కిలి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ‘ మరాదూ ‘ పోష్ లొకాలిటీలో గల ఈ భవనాలన్నీ కోస్తా తీరప్రాంత నిబంధనలను అతిక్రమించి కట్టినవేనట. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేరళ ప్రభుత్వం వీటి నేలమట్టానికి ఆదేశాలిచ్చింది. రెండురోజులపాటు కూల్చివేతలు సాగుతాయి.వీటి కూల్చివేతకు కేరళ ప్రభుత్వం 138 రోజుల గడువునిచ్చింది. తమ ఫ్లాట్లను కోల్పోయినవారికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 350 ఫ్లాట్లతో కూడిన ఈ భవనాలను నేలమట్టం చేయడానికి 800 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారు. ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించడంలేదు. అలాగే అన్ని రకాల ట్రాఫిక్ రాకపోకలను, జల, వైమానిక రవాణాను కూడా నిషేధించారు. తమ ఇళ్లను వదిలి వెళ్లేవారు విద్యుత్, స్విచ్ లను ఆఫ్ చేసి వెళ్లాలని ముందుగానే ఆదేశించారు. వీరికి తాత్కాలిక రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.  శనివారం 18 అంతస్థుల అపార్ట్ మెంట్ ను, 73 ఫ్లాట్లతో కూడిన భవనాన్ని కూల్చివేశారు. ఆదివారం కూడా మరో బహుళ అంతస్థుల భవనాన్ని కుప్పకూల్చనున్నారు.