యూఎస్‌ సెమీస్‌లో సెరెనాకు షాకిచ్చిన అజరెంకా

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గంపెడాశలు పెట్టుకున్న సెరెనా విలియమ్స్‌కు సెమీ ఫైనల్లో ఎదురుదెబ్బ తగిలింది. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలో దిగిన సెరెనాకు వరల్డ్‌ మాజీ నంబర్‌వన్‌ క్రీడాకారిణి, బెలారస్‌కు చెందిన విక్టోరియా అజరెంకా ఆ అవకాశం ఇవ్వలేదు.

యూఎస్‌ సెమీస్‌లో సెరెనాకు షాకిచ్చిన అజరెంకా
Follow us

|

Updated on: Sep 11, 2020 | 12:40 PM

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గంపెడాశలు పెట్టుకున్న సెరెనా విలియమ్స్‌కు సెమీ ఫైనల్లో ఎదురుదెబ్బ తగిలింది. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలో దిగిన సెరెనాకు వరల్డ్‌ మాజీ నంబర్‌వన్‌ క్రీడాకారిణి, బెలారస్‌కు చెందిన విక్టోరియా అజరెంకా ఆ అవకాశం ఇవ్వలేదు. ఆర్ధర్‌ ఆషే స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌ పోరులో అజరెంకా చాలా ఈజీగా విజయం సాధించింది.. 1-6, 6-3, 6-3 తేడాతో సెరెనాపై విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది.. తొలి సెట్‌లో సెరెనా విజృంభించడంతో అజరెంకా బిత్తరపోయింది.. అయితే తర్వాత రెండు సెట్లలో తన తఢాకా చూపించింది.. ఆత్మవిశ్వాసంతో సెరెనాను ఎదుర్కొంది. మేజర్‌ టోర్నమెంట్లలో తొలి సెట్‌ను గెల్చుకున్న తర్వాత మ్యాచ్‌ను ఓడిపోవడం సెరెనాకు ఆరేళ్ల తర్వాత ఇదే ప్రథమం కావడం గమనార్హం.. 2014లో జరిగిన వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో అలెజ్‌ కార్నెట్‌ చేతిలో కూడా సెరెనా ఇదే విధంగా ఓటమి చెందారు. తల్లి అయిన తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెల్చుకోవాలనుకున్న సెరెనా ఆశలపై అజరెంకా నీళ్లు చల్లింది. చాన్నాళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో అజరెంకా ఫైనల్‌కు చేరింది. చివరిసారిగా 2013లో ఫైనల్లోకి అడుగు పెట్టిన అజరెంకా ఇన్నాళ్లకు మళ్లీ ఆ ఘనత సాధించింది. అయితే యూఎస్‌ ఓపెన్‌లో సెరెనాపై విజయం సాధించడమన్నది అజరెంకాకు ఇదే మొదటిసారి.. 2012, 2013లలో యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరుకున్న అజరెంకాను ఆ రెండు సార్లు సెరెనానే ఓడించింది.. అలా పాపం రన్నరప్‌తో సంతృప్తి చెందాల్సి వచ్చింది.. ఈసారి మాత్రం టైటిల్‌ సాధించడం పక్కా అని కాన్ఫిడెంట్‌గా చెబుతోంది అజరెంకా.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?