పోలవరం పనులను ఆపొద్దు: ఉప రాష్ట్రపతి సూచన

పోలవరం పనులను ఆపొద్దంటూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ఇవాళ ఢిల్లీలో వెంకయ్య నాయుడుతో ప్రకాశ్ జవదేకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో పలు విషయాలపై చర్చించిన వెంకయ్య నాయుడు.. పోలవరంపై వేసిన ‘స్టాప్‌ వర్క్ ఆర్డర్’ ఆదేశాలను మరో రెండేళ్ల పాటు నిలుపుదల చేయాలని సూచించారు. పోలవరం ఏపీ ప్రజలకు వరమని చెప్పిన ఆయన ఈ ప్రాజెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని కోరారు. ఇక దీనిపై ప్రకాశ్ జవదేకర్‌ కూడా సానుకూలంగా స్పందిస్తూ.. దానికి సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు. అయితే పోలవరం విషయంలో ‘స్టాప్ వర్క్‌ ఆర్డర్‌’పై కేంద్రం ఇదివరకు నాలుగు సార్లు  నిలుపుదల ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *