Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

వి ఆర్ విత్ యూ ఇండియా: అమెరికా

, వి ఆర్ విత్ యూ ఇండియా: అమెరికా

అమెరికా: పుల్వామాలో జరిగిన దాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా  భారత్‌ ఎలాంటి చర్యలు చేపట్టినా వాటిని తాము అండగా ఉంటామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. అమెరికా భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌.. భారత భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో ఫోన్లో మాట్లాడి సంతాపం ప్రకటించారు.

‘పుల్వామా ఘటనపై సంతాపం తెలియజేసేందుకు అజిత్‌ డోభాల్‌తో మాట్లాడాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ ఆత్మరక్షణ చర్యలను మేం సమర్థిస్తాం. ఉగ్రవాదులకు పాక్‌ స్వర్గధామంగా ఉండొద్దని ఆ దేశానికి చెబుతూనే ఉన్నాం’ అని బోల్టన్‌ తెలిపారు.

అంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపెయో కూడా ఉగ్రదాడిని ఖండిస్తూ ట్వీట్‌ చేశారు. ‘ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు మేం అండగా ఉంటాం. అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా మారుతున్న ఉగ్రవాదులకు పాక్‌ ఆశ్రయం ఇవ్వకూడదు’ అని పాంపెయో ట్విటర్‌లో పేర్కొన్నారు. ఉగ్ర సంస్థలకు ఆశ్రయం ఇవ్వడాన్ని, సాయం అందించడాన్ని తక్షణమే మానుకోవాలని పాకిస్థాన్‌కు అమెరికా గట్టి హెచ్చరిక చేసింది.