Ram Temple: రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఎప్పటినుంచి తీసుకుంటారో ప్రకటించిన వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్…

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు జనవరి 15 నుంచి స్వీకరించనున్నట్లు విశ్వ హిందు పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ ప్రకటించారు.

Ram Temple: రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఎప్పటినుంచి తీసుకుంటారో ప్రకటించిన వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 30, 2020 | 7:20 AM

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు జనవరి 15 నుంచి స్వీకరించనున్నట్లు విశ్వ హిందు పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఉన్న 5 లక్షల 25 వేల గ్రామాల్లో తిరిగి చందాలు సేకరిస్తామని తెలిపారు. చందాల స్వీకరణలో నిబద్ధత పాటిస్తామని అన్నారు. వివిధ బ్యాంకుల నుంచి డిపాజిట్లను స్వీకరిస్తున్నామని అన్నారు.

జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు…

ఆలయ నిర్మాణానికి అవసరమయ్యే నగదు కోసం జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు తిరిగి విరాళాలు సేకరిస్తామని ప్రకటించారు. విశ్వ హిందు పరిషత్‌కు చెందిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రామాలయ నిర్మాణాని కోసం యుద్ధమే చేశారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణం కోసం రామ్ జన్మభూమి కీర్తి క్షేత్ర ట్రస్ట్ భక్తుల నుంచి విరాళాలు స్వీకరించనుంది.