దేవాలయాలను తెరవండి, మహారాష్ట్రలో విశ్వహిందూ పరిషద్ ఆందోళన

మహారాష్ట్రలో సాధ్యమైనంత త్వరగా దేవాలయాలను తెరవాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషద్, బజరంగ్ దళ్ కార్యకర్తలు శనివారం ఆందోళనకు పూనుకొన్నారు. నాసిక్ లోని  షిరిడీలో వారు డ్రమ్ములు వాయిస్తూ, గంటలు కొడుతూ నిరసన తెలిపారు. నాగపూర్ లో 11 ఆలయాల బయట కూడా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం మాల్స్, మార్కెట్లు, మద్యం షాపులను సైతం తెరిచిందని, కానీ ఆలయాల విషయం వచ్ఛేసరికి వెనుకంజ ఎందుకు వేస్తోందని వారు ప్రశ్నించారు. త్వరలో […]

దేవాలయాలను తెరవండి, మహారాష్ట్రలో విశ్వహిందూ పరిషద్ ఆందోళన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 24, 2020 | 8:14 PM

మహారాష్ట్రలో సాధ్యమైనంత త్వరగా దేవాలయాలను తెరవాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషద్, బజరంగ్ దళ్ కార్యకర్తలు శనివారం ఆందోళనకు పూనుకొన్నారు. నాసిక్ లోని  షిరిడీలో వారు డ్రమ్ములు వాయిస్తూ, గంటలు కొడుతూ నిరసన తెలిపారు. నాగపూర్ లో 11 ఆలయాల బయట కూడా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం మాల్స్, మార్కెట్లు, మద్యం షాపులను సైతం తెరిచిందని, కానీ ఆలయాల విషయం వచ్ఛేసరికి వెనుకంజ ఎందుకు వేస్తోందని వారు ప్రశ్నించారు. త్వరలో ఆలయాలు తెరవకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని, ఆలయాల తాళాలను బద్దలు కొడతామని ఈ సంస్థల సభ్యులు హెచ్చరించారు.  రాష్ట్రంలోని పలు ఇతర నగరాల్లో కూడా వీరు నిరసనలతో హోరెత్తించారు.