Breaking News
  • తూర్పుగోదావరి: రైతు సదస్సులో జనసేన కార్యకర్తలపై పవన్ ఆగ్రహం. మీకు క్రమశిక్షణ లేదంటూ కార్యకర్తలపై పవన్ ఆగ్రహం. మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోయానన్న పవన్
  • ఢిల్లీ అగ్నిప్రమాదంపై క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు. ఫ్యాక్టరీ యజమానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు. పరారీలో ఫ్యాక్టరీ యజమాని. వారం రోజుల్లో విచరాణ పూర్తి చేయాలని ఆదేశాలు
  • అమరావతి: ఈ నెల 23 నుంచి కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన. మూడు రోజులపాటు పర్యటించనున్న వైఎస్‌ జగన్‌. జమ్మలమడుగు, పులివెందుల, కడప, మైదుకూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్న జగన్‌
  • అనంతపురం: సాకే పవన్‌ చేసిన వ్యాఖ్యలకు జనసేన మద్దతు. సాకే వ్యాఖ్యలను సమర్థించిన అనంతపురం జనసేన నేతలు. రెడ్డి సంఘం నేతలపై జనసేన నేతల ఆగ్రహం
  • భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
  • మాజీ ఎంపీ కవితకు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం. ఐఎస్‌బీలో ఇండియన్‌ డెమక్రసీ ఎట్‌ వర్క్‌ సదస్సుకు ఆహ్వానం. జనవరి 9, 10 తేదీలలో జరగనున్న సదస్సు. మనీ పవర్‌ ఇన్‌ పాలిటిక్స్‌ అంశంపై ప్రసంగించనున్న కవిత
  • తూ.గో:జనసేన రైతు సదస్సును ముట్టడించిన ఎమ్మార్పీఎస్‌. పవన్‌ రైతు సదస్సులోకి చొచ్చుకొచ్చిన ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు. అడ్డుకున్న జన సైనికులు, ఇరువురి మధ్య తోపులాట. సమస్యలపై పవన్‌తో మాట్లాడాలంటూ వాగ్వాదం

సీనియర్లు డెడ్ బాడీస్.. కాంగ్రెస్‌లో కాకరేపిన కామెంట్లు

in fight in telangana congress, సీనియర్లు డెడ్ బాడీస్.. కాంగ్రెస్‌లో కాకరేపిన కామెంట్లు
అధికారంలో వున్నా.. అధికారానికి దూరమైనా కాంగ్రెస్ పార్టీ నేతల తీరే వేరు. అంతర్గత ప్రజాస్వామ్యం అపారంగా వున్న కాంగ్రెస్ పార్టీలో రేగిన రచ్చకు ఇవాళ గాంధీభవన్ మరోసారి మూగ సాక్షిగా నిలిచింది. సాక్షాత్తు జాతీయ నాయకుడు గులాం నబీ ఆజాద్ సమక్షంలో సీనియర్ల మధ్య రగిలిన రచ్చతో గాంధీ భవన్ దద్దరిల్లింది. ఇంతకీ సీనియర్లను డెడ్ బాడీస్ అన్నదెవరు ? కాంగ్రెస్ పార్టీలో ఆర్.ఎస్.ఎస్. రక్తమంటూ ఆరోపించిందెవరు ? మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసిందెవరు ?
గులాం నబీ ఆజాద్ రాకతో గాంధీభవన్ దద్దరిల్లింది. సీనియర్ల మధ్య కొత్త చిచ్చు రేపింది. తెలంగాణ  కాంగ్రెస్ పార్టీలో కొత్తగా కుదిరిన సమీకరణలు, దోస్తీలు కాక రేపుతున్నాయి. ఇంతకీ గులాం నబీ ఆజాద్ రాకతో ఎందుకు వివాదం రగిలింది ? నిజానికి ఆజాద్ ఎప్పుడొచ్చాడన్నదే వివాదానికి నాందీ ప్రస్తావన. ఆజాద్ రాకతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసాగా మారడానికి ఆజాద్ పర్యటనే కారణమైంది.
సమావేశానికి హాజరైన సీనియర్ నేత వి.హనుమంతరావు ముందుగా ఆజాద్ పర్యటనకు సంబంధించి తనకెందుకు సమాచారం ఇవ్వలేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీని నిలదీయడంతో వివాదాం మొదలైంది. ఆజాద్ జాతీయ నాయకుడు ఆయన రాక సీనియర్లకు తెలపాల్సి వుందంటూ.. కొత్తగా వచ్చిన వారు సీనియర్లను విస్మరిస్తున్నారని వాదించారు. విహెచ్ కామెంట్లతో ఆగ్రహం చెందిన షబ్బీర్ అలీ.. విహెచ్ ఆగ్రహానికి మరింత ఆజ్యం పోశారు. సీనియర్లంతా ఒక రకంగా డెడ్ బాడీస్ అంటూ వృద్ధ నేతలు పార్టీకి భారమన్నట్లు మాట్లాడారు. దాంతో విహెచ్ మరింత రెచ్చిపోయారు. కట్టలు తెగిన ఆవేశం ఇద్దరు నేతలు పరస్పరం బూతులు తిట్టుకున్నారు.
ఆజాద్ సమక్షంలోనే వీరిద్దరు బూతులు తిట్టుకోవడంతో ఆయన మౌనంగా వుండిపోయినట్లు సమాచారం. మిగిలిన వారంతా సముదాయించడంతో షబ్బీర్ సమావేశంలో వుండిపోగా.. విహెచ్ సమావేశం నుంచి అలిగి వెళ్ళిపోయారు. నేరుగా విలేకరుల సమావేశంలోకి వచ్చి… గొడవ జరిగింది వాస్తవమేనని.. మీకు తోచింది మీరు రాసుకోండని మీడియాకు చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. సమావేశంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై  కూడా విహెచ్ ఘాటైన కామెంట్లు చేశారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఆర్.ఎస్.ఎస్. రక్తమని, ఆయనతో షబ్బీర్ గ్రూపు కడుతున్నాడని విహెచ్ ఆరోపించారు.
మొత్తానికి అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో మరోసారి కాక  రేపింది. కాంగ్రెస్ నేతల రూటే సెపరరేటని చాటింది.