ప్రగతి భవన్‌‌లో శునకం మృతి.. వైద్యుడిపై కేసు నమోదు

Veterinarian booked after Pet dog at CM KCR's residence dies, ప్రగతి భవన్‌‌లో శునకం మృతి.. వైద్యుడిపై కేసు నమోదు

సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్‌లో హస్కీ అనే ఓ పెంపుడు శునకం మృతిచెందింది. ఈ నెల 10వ తేదీన 11నెలల హస్కీ అనారోగ్యానికి గురైంది. దీంతో ప్రగతి భవన్‌ డాగ్స్‌ హ్యాండ్లర్‌ ఆసిఫ్‌ అలీఖాన్‌.. రెగ్యులర్ వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ వైద్యుడు వచ్చి చికిత్స అందించాడు. తీవ్రంగా జ్వరం ఉండటంతో లివర్‌ టానిక్‌ ఇచ్చాడు. అనంతరం హస్కీ పరిస్ధితి మరింత విషమించింది. దీంతో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 4లో యానిమల్‌ కేర్‌ క్లినిక్‌కు తీసుకెళ్లాడు. అయితే డాక్టర్ చికిత్స చేస్తుండగా ఆ కుక్క మరణించింది. దీంతో డాగ్స్ హ్యాండ్లర్ ఆలీఖాన్.. యానిమల్ కేర్ క్లినిక్ వైద్యుడైన రంజిత్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే కుక్క మృతిచెందిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఆ వైద్యుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, బహదూర్‌పురాకు చెందిన ఆసిఫ్‌ అలీఖాన్‌ ఐదేళ్లుగా ప్రగతి భవన్‌ డాగ్‌ హ్యాండ్లర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మొత్తం 9 పెంపుడు కుక్కలకు సంరక్షణ చూసుకుంటూ శిక్షణనిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *